కొట్టేసిన బైక్​లపై తిరుగుతూ చైన్​ స్నాచింగ్​లు

కొట్టేసిన బైక్​లపై తిరుగుతూ చైన్​ స్నాచింగ్​లు

హైదరాబాద్, వెలుగు: కొట్టేసిన బైక్​లపై తిరుగుతూ చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్న డిగ్రీ స్టూడెంట్​ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరెడ్​మెట్​లోని రాచకొండ కమిషనరేట్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన గ్యార హృదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశాల్ అలియాస్ చిన్ను(21) డిగ్రీ ఫైనలియర్ చదువుతూ హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన విశాల్​ ఈజీ మనీ కోసం తన ఫ్రెండ్​తో కలిసి చైన్ స్నాచింగ్స్ మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి బైక్​లు కొట్టేసి వాటిపై తిరుగుతూ చైన్ ​స్నాచింగ్​లకు పాల్పడేవారు. ఈ ఏడాది మార్చిలో 4 బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు కొట్టేసి వాటిపై తిరుగుతూ వరుసగా స్నాచింగ్స్ చేశారు. రూరల్ ఏరియాలు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేశారు.

వరుస చోరీలు..

హృదయ్ విశాల్, అతడి ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ ఏడాది మార్చి 2న మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా పీర్జాదిగూడలో ఓ బైక్​ను కొట్టేశారు. మార్చి 3న ఆ బైక్​పై బీబీనగర్ మండలం కొండమడుగుకు వెళ్లి చైన్​ స్నాచింగ్ చేశారు. తర్వాత బైక్​ను అక్కడే వదిలేసి పారిపోయారు. 4న మలక్​పేటలో ఓ బైక్​ చోరీ చేసి.. 5న మళ్లీ బీబీనగర్​ వెళ్లి చైన్​ స్నాచింగ్​కు పాల్పడ్డారు. ఆ బైక్​ను ఘట్​కేసర్ శివారులో వదిలేశారు. తర్వాత ఘట్​కేసర్​లోనే ఓ బైక్ ​చోరీ చేసి 9న బీబీనగర్​లోని గూడురులో చైన్ స్నాచింగ్​చేశారు. అక్కడి నుంచి జనగామకు వెళ్లారు. అక్కడి రైల్వేస్టేషన్​లో బైక్ చోరీ చేసి దానిపై తిరుగుతూ స్నాచింగ్​కు యత్నించి విఫలమయ్యారు. దీంతో బైక్​ను అక్కడే వదిలి సిటీకి వచ్చేశారు.

మణప్పురంలో తాకట్టు పెట్టి వాటాలు

వీరిద్దరు కలిసి దొంగిలించిన బంగారాన్ని మణప్పురం గోల్డ్​లో తాకట్టు పెట్టేవారు. వచ్చిన డబ్బును పంచుకునేవారు. తర్వాత జల్సాలు చేసేవారు. ఆ డబ్బు అయిపోగానే మళ్లీ బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్​లకు పాల్పడేవారు. మేడిపల్లి, పీర్జాదిగూడ, బీబీనగర్, ఘట్​కేసర్​లో జరిగిన వరుస చైన్ స్నాచింగ్స్​పై  మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి ఎస్​వోటీ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్, బైక్​ నంబర్ల ఆధారంగా స్నాచింగ్​లకు పాల్పడింది హృదయ్ విశాల్​గా గుర్తించారు. సోమవారం అతడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీపీ చౌహాన్​ తెలిపారు. పరారీలో ఉన్న మరో స్నాచర్​ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.