రద్దీ ప్రాంతాల్లో అసభ్య చేష్టలు..198 మంది పోకిరీలను అరెస్టు చేసిన రాచకొండ షీ టీమ్స్

రద్దీ ప్రాంతాల్లో అసభ్య చేష్టలు..198 మంది పోకిరీలను అరెస్టు చేసిన రాచకొండ షీ టీమ్స్

ఎల్బీనగర్, వెలుగు: రద్దీ ప్రాంతాల్లో బాలికలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 198 మంది పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాచకొండ షీ టీమ్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి మాట్లాడారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మహేశ్వరం డీసీపీ జోన్ల పరిధిలో ఈ నెల 1 నుంచి 15 వరకు 229 ఫిర్యాదులు తమకు వచ్చాయన్నారు. 198 మందిని అదుపులోకి తీసుకొని కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. 

సోషల్ మీడియావి 85 కేసులు, ప్రత్యక్షంగా వేధించినవి 104, ఫోన్ ల ద్వారా వేధించినవి 40 కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల్లో 115 మంది మైనర్లు ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా టీజింగ్​ చేస్తే 87126 62111 నంబర్​కు వాట్సాప్​లో ఫిర్యాదు చేయాలని సూచించారు.