41ఏ సీఆర్‭పీసీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు: అడ్వకేట్ రచన

41ఏ సీఆర్‭పీసీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు: అడ్వకేట్ రచన

బీఎల్ సంతోష్‭కు సిట్ ఇచ్చిన 41ఏ సీఆర్ పీసీ నోటీసులపై హైకోర్టులో క్యాష్ పిటిషన్ ఫైల్ వేశామని బీజేపీ అధికార ప్రతినిధి, అడ్వకేట్ రచనా రెడ్డి తెలిపారు. పోలీసులు ఇచ్చిన 4 1ఏ నోటీసులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు. అనుమానితుల నుండి ఎలాంటి ఆధారాలు దొరికాయనే దానిపై పోలీసులు కోర్టుకు ఎలాంటి సమచారం ఇవ్వలేదని అన్నారు. దీంతో 41ఏ నోటీసులపైన హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. 

బీఎల్ సంతోష్ కు ఎందుకు 41 ఏ నోటీసులు ఇచ్చారో చెప్పాలని తాము అడిగామని రచనారెడ్డి అన్నారు. బీఎల్ సంతోష్ అనుమానితుడా, సాక్షినా అనే విషయాన్ని  పొందుపరచలేదని స్పష్టం చేశారు. ఈ నెల 5న బీఎల్ సంతోష్‭కు నోటీసులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని పోలీసులను  హైకోర్టు క్వశ్చన్ చేసిందని రచనారెడ్డి వెల్లడించారు. బీఎల్ సంతోష్ ను ఎందుకు విచారణకు పిలుస్తున్నారో కూడా కారణాలు చెప్పలేదన్నారు. దాని గురించి ఎటువంటి సంభాషణ లేకుండా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.