V6 News

2 వేల 600 పంచాయతీల్లో కాంగ్రెస్ ఘన విజయం.. విజేతలకు పీసీసీ తరఫున అభినందనలు :పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

2 వేల 600 పంచాయతీల్లో కాంగ్రెస్ ఘన విజయం.. విజేతలకు పీసీసీ తరఫున అభినందనలు :పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ఏకగ్రీవమైన చోట90% కాంగ్రెస్ మద్దతుదారులే 

చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయ్ 

తొలివిడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్ద తుదారులు 60%కు మించి విజయం సాధించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్ లో 4,230 పంచాయతీలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 2 వేల 600 పైచిలుకు స్థానా ల్లో గెలిచారని చెప్పారు. ఏకగ్రీవం అయిన చోట్ల 90శాతం కాంగ్రెస్ మద్దతు దారులే సర్పంచులు గా ఉన్నారన్నారు. చాలా చోట్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోటీచేశాయనిచెప్పారు. 

వెయ్యికి దగ్గరగా బీఆర్ఎస్, 200 లోపు బీజేపీ, 40 చోట్ల సీపీఎం, 30 స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు గెలిచారన్నా రు. రెండో విడత, మూడో విడత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ మద్దతు దారులకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. జనం కాంగ్రెస్ ప్ర జాపాలనకు అండగా నిలిచారన్నారు. 

15 నెలల్లో 80 వేల కొలువులు భర్తీ చేశామని, మహిలలకు ఉచిత బస్సు, సన్నబియ్యం పంపిణీ ప్రజలను ఆకర్షించిందననారు. గ్లోబల్ సమ్మిట్ తో ఊహించని విధంగా 5 లక్షల 75 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు.