నా కొడుకు సర్పంచ్ అయ్యిండు. మస్తు కష్టపడ్డడు. పుట్టిన కాడల్లా డబ్బులు తెచ్చి కర్చవెట్టిండు. శానా కష్టపడ్డం.. గెలుస్తమో లేదో అనే బుగులుండే.. కానీ గెలిచిండు.. నా కొడుకు సర్పంచి అయ్యిండు.. అంటూ కొడుకు గెలుపు గురించి అందరికీ చెబుతూ గుండెపోటుతో ఓ తల్లి కుప్పకూలిన ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నిపింది.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రానంపల్లి సర్పంచ్ గా కొండల్వాడి శంకర్ విజయం సాధించాడు. గురువారం (డిసెంబర్ 11) జరిగిన ఎన్నికలో గెలవడంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు.
తన కుమారుడి గెలుపుపై చాలా ఆనందపడింది సర్పంచ్ శంకర్ తల్లి లింగవ్వ (60) . ఎలా కష్టపడింది.. ఏమేం చేసింది.. కొడుకు కష్టాలను గురించి చుట్టుపక్కల వాళ్లతో చెప్పింది. ఆనందాన్ని పొరుగు వారితో పంచుకుంటున్న సమయంలో.. ఆయన తల్లి గుండెపోటుతో కన్నుమూశారు. గెలుపు ఆనందం తీరకముందే తల్లి మృతి చెందటంతో శంకర్ విషాదంలో మునిగిపోయింది.

