రాజకీయ నాయకులతో పాటు.. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్

రాజకీయ నాయకులతో పాటు.. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మూడో రోజు విచారిస్తున్నారు పోలీసులు. మొదటి రోజు కస్టడీలో రాధా కిషన్ రావును 6 గంటలకు పైగా విచారించింది దర్యాప్తు బృందం. నిన్న(ఏప్రిల్ 5) రాధా కిషన్ రావుకి బీపీ ఎక్కువ అవడంతో బయట నుంచి డాక్టర్స్ ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించారు పోలీసులు. రాధా కిషన్ రావు, ప్రణీత్ రావు టీంని పిలిపించి విచారిస్తున్నారు. ఇప్పటికే 34 మందిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు.

హోమ్ గార్డ్ నుంచి ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారుల వరకు.. పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రణీత్ రావు అండ్ టీంకి సర్వీస్ ప్రొవైడర్లు సహకరించినట్లు అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు బృందం తెలిపింది.

రాజకీయ నాయకులవే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ కూడా రాధా కిషన్ రావు తయారు చేసి.. ఫోన్లు ట్యాప్ చేశారని తేలింది. కస్టడీలో రాధా కిషన్ రావు ఇచ్చే సమాచారంతో మరికొందరిని అరెస్టు చేసే అవకాశముందని దర్యాప్తు బృందం వెల్లడించింది.