మేడారం భక్తుల సేవలో రాధా టీఎంసీ స్టీల్

మేడారం భక్తుల సేవలో రాధా టీఎంసీ స్టీల్

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాధా టీఎంటీ స్టీల్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మినరల్​ వాటర్​ పంపిణీ, బ్రెస్ట్​ ఫీడింగ్​రూమ్​లను ఏర్పాటు చేయగా, మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సుమన్​సరాఫ్, డైరెక్టర్​ అక్షత సరాఫ్​ మాట్లాడుతూ మూడు జాతరల నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 మేడారం జాతరలో బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి శిశువులకు పాలిచ్చే గదిని ప్రారంభిస్తున్నామని జాతరలో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ వినియోగించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.