‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ తల్లి గుర్తుందా..? పాపం.. తలకు దెబ్బ తగిలి 13 కుట్లు పడ్డయ్..!

‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ తల్లి గుర్తుందా..? పాపం.. తలకు దెబ్బ తగిలి 13 కుట్లు పడ్డయ్..!

‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్ర పోషించిన బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తలకు తీవ్ర గాయమైంది. సర్జరీ చేసిన వైద్యులు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 13 కుట్లు వేశారు. హాస్పిటల్ లో తన పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ఆమె తన ఇన్స్టాగ్రాంలో ఫొటోలో పోస్ట్ చేసింది. 

పికిల్ బాల్ ఆడుతుండగా తన తలకు గాయమైనట్లు ఆమె తెలిపింది. రెండు ఫొటోలను ఆమె తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. ఒక ఫొటోలో హాస్పిటల్ బెడ్ పై ఆమె చికిత్స తీసుకుంటున్న దృశ్యం కనిపించింది. మరో ఫొటోలో తలపై బ్యాండేజ్ వేసుకుని నవ్వుతూ తను కోలుకుంటున్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేసింది. ఆమెను ఆ స్థితిలో చూసిన అభిమానులు భాగ్యశ్రీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీటీ, బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలి ఉండే పికిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొన్ని ప్రత్యేకమైన రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. 1965లో అమెరికాలో మొదలైన ఈ ఆటకు మన దగ్గర ఇటీవల విశేషమైన ఆదరణ లభిస్తోంది. సినీ నటి సమంత వల్ల ఈ గేమ్కు సినీ ఇండస్ట్రీలో క్రేజ్ దక్కింది. హైదరాబాద్‌‌‌‌ కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో పాడిల్ వెవ్ సంస్థ పికిల్ బాల్ కోర్టులను కూడా ఏర్పాటు చేసింది.

Also Read : : రిలీజ్కు ముందే 'సూపర్ డిజాస్టర్' అంటూ సినీ క్రిటిక్ పోస్ట్

ఇక.. సీనియర్ నటి భాగ్యశ్రీ విషయానికొస్తే.. 1989లో సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం జరిగిన ఆమె చాలా సంవత్సరాల తర్వాత కంగనా రనౌత్ తలైవి(2021)తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో జయలలిత తల్లి పాత్రను ఆమె పోషించింది. 

2022లో విడుదలైన ‘రాధే శ్యామ్’ సినిమాలో కూడా భాగ్యశ్రీ ప్రభాస్ తల్లి పాత్ర పోషించింది. ‘రాధే శ్యామ్’ సినిమా పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఆమె పాత్రకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. భాగ్యశ్రీ పలు మరాఠీ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటిస్తూ సినీ కెరీర్లో ముందుకెళుతుండగా ఇలా తలకు గాయం కావడం గమనార్హం.