మాజీ సీఎం భార్య హీరోయిన్గా కొత్త సినిమా..ఏడు భాష‌ల్లో అజాగ్ర‌త్త

మాజీ సీఎం భార్య హీరోయిన్గా కొత్త సినిమా..ఏడు భాష‌ల్లో అజాగ్ర‌త్త

క‌ర్ణాట‌క మాజీ సీఏం కుమార‌స్వామి(Kumaraswamy) భార్య రాధిక కుమార‌స్వామి( Radhika Kumaraswamy) హీరోయిన్​గా ఓ ప్యాన్​ ఇండియా సినిమా రాబోతోంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్లుక్​ పోస్టర్​ తాజాగా విడుదలైంది. ఈ పోస్ట‌ర్‌లో ఏరుపు రంగు చీర ధ‌రించి ఒంటినిండా బంగారు న‌గ‌ల‌తో కంప్లీట్ ట్రెడిష‌న‌ల్ లుక్‌లో రాధిక క‌నిపిస్తోంది.

ఏడు భాషల్లో వస్తున్న ఈ మూవీకి తెలుగులో అజాగ్రత్త(Ajagratha) టైటిల్​ను ఫిక్స్​చేశారు. ఇందులో బాలీవుడ్​నటుడు శ్రేయాస్​ తల్పడే(Shreyas Talpade), సునీల్‌, రావుర‌మేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

క‌న్న‌డంలో కుట్టి రాధిక‌గా ఫేమ‌స్ అయిన రాధిక కుమార‌స్వామి హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసింది. తెలుగులో భ‌ద్రాద్రి రాముడు, అవ‌తారం సినిమాల్లో నటించింది. ఇక కన్నడలో య‌శ్, శివ‌రాజ్‌కుమార్‌, పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్​ హీరోలతో సైతం ఆమె జోడీ కట్టింది.