
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యం, సమాజంపై సానుకూల ప్రభావం చూపాలనే లక్ష్యంతో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఆదివారం ‘సైకిల్ ఫర్ ఎ కాజ్’ పేరిట సైక్లింగ్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇందులో 120 మందికి పైగా సైక్లిస్టులుఉత్సాహంగా పాల్గొన్నారు.
3, 6, 50 కి.మీ దూరంతో మూడు వేర్వేరు పోటీలను నిర్వహించారు. ఈ సైక్లింగ్ ఈవెంట్ ద్వారా సేకరించిన నిధులను రాడిసన్ పీపుల్ ఫౌండేషన్‌కు అందిస్తారు. వీటిని హాస్పిటాలిటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని ఆర్గనైజర్లు తెలిపారు.