వింబుల్డన్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ బుల్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌ జోరు

వింబుల్డన్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ బుల్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌ జోరు

లండన్‌‌‌‌‌‌‌‌:  వింబుల్డన్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ బుల్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌ జోరు కొనసాగిస్తున్నాడు. అలవోక విజయాలతో టైటిల్‌‌‌‌ దిశగా దూసుకెళ్తున్నాడు. రెండో సీడ్‌‌‌‌ నడాల్ మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో పదోసారి ప్రిక్వార్టర్స్‌‌‌‌ చేరుకోగా.. నాలుగో సీడ్‌‌‌‌ స్టెఫనోస్‌‌‌‌ సిట్సిపాస్‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌లోనే ఇంటిదారి పట్టాడు.  శనివారం అర్ధరాత్రి జరిగిన మూడో రౌండ్‌‌‌‌లో నడాల్‌‌‌‌ 6–1, 6–2, 6–4తో 27వ సీడ్‌‌‌‌ లోరెంజో సెనెగో (ఇటలీ)ని వరుస సెట్లలో చిత్తు చేశాడు.  మరో మ్యాచ్‌‌‌‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌‌‌‌ నిక్‌‌‌‌ కిరియోస్‌‌‌‌ 6–7 (2/7), 6–4, 6–3, 7–6 (9/7)తో సిట్సిపాస్‌‌‌‌ (గ్రీస్‌‌‌‌)కు చెక్‌‌‌‌ పెట్టి ప్రిక్వార్టర్స్‌‌‌‌లో అడుగు పెట్టాడు. ఇక, తొమ్మిదో సీడ్‌‌‌‌ కామెరూన్‌‌‌‌ నోరి (బ్రిటన్) ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌లో 6–4, 7–5, 6–4తో టామీ పాల్‌‌‌‌ (అమెరికా)ను ఓడించి క్వార్టర్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరుకున్నాడు.  మరోవైపు  విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో జర్మనీ ప్లేయర్‌‌‌‌ టట్జానా మరియా తొలిసారి క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌‌‌‌లో అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ మరియా  5–-7, 7–-5, 7–-5 తో 12వ సీడ్‌‌‌‌ జెలెనా ఒస్తపెంకో (లాత్వియా)కు షాకిచ్చింది. 

క్వార్టర్స్​లో సానియా జోడీ

మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ఇండియా స్టార్‌‌‌‌ సానియా మీర్జా, మేట్‌‌‌‌ పవిచ్‌‌‌‌ (క్రొయేషియా) క్వార్టర్స్‌‌‌‌ చేరారు. ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ప్రత్యర్థి  లటిషా–ఇవాన్‌‌‌‌ డోడింగ్‌‌‌‌పై  సానియా జంటకు వాకోవర్‌‌‌‌ విజయం లభించింది.