రాఫెల్ డీల్ సక్రమంగానే జరిగిందని, ఈ ఒప్పందంపై సీబీఐ విచారణ అవసరం లేదని కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్లను కొట్టి వేయాలని సుప్రీంను కోరింది. గతేడాది డిసెంబర్ 14న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని దాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల ధరల వివరాలను కాగ్ కు ఇచ్చామని, సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్ లో క్లారిటీ ఇచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వ ఒప్పందం కంటే 2.86 శాతం తక్కువ ధరకే రాఫెల్ విమానాలు కొన్నట్లు కేంద్రం చెప్పింది.
