
బాలీవుడ్ బ్యూటీ సాక్షి మాలిక్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో సాక్షిని కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్ చెంపదెబ్బ కొట్టినట్టు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ.. 'ఇది అవసరం లేని ఆగ్రహం' అంటూ రాఘవ్పై విమర్శలు చేస్తున్నారు. రాఘవ్ ఆమెను ఎందుకు కొట్టాడు..? అన్నది నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
ఈ వీడియో గురించి సాక్షి మాలిక్ స్పందిస్తూ, 'అది యాక్టింగ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో మాత్రమే.. నిజంగా అలా ఎవ్వర్నీ హర్ట్ చేయాలని ఉద్దేశం లేదు' అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఈ వీడియోను పబ్లిసిటీ కోసం ప్రణాళికాబద్ధంగా విడుదల చేశారా! అనే కోణంలో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 'ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ అవసరం లేదంటూ" కామెంట్స్ చేస్తున్నారు.
అయినా, సాక్షి మాలిక్ మాత్రం తన స్పష్టతతో ఈ వివాదాన్ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే, సాక్షి టీవీ కమర్షియల్స్, మ్యూజిక్ వీడియోతో పాటు, కొన్ని సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ‘వేహం’,‘ములాఖత్’ వంటి మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా నటించింది.అంతేకాకుండా స్టైలిష్ ఫొటోషూట్లు, ఫిట్‌నెస్ కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.
That viral slap? It was just a scene rehearsal, folks! Raghav Juyal & Sakshi Malik set the record straight "#BehindTheScenes #ViralTruth #ActorsLife pic.twitter.com/wohgG3v3Z9
— CineHind (@CineHind) August 7, 2025