
రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా పి.వాసు(P.Vasu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చంద్రముఖి 2(Chandramukhi2). బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) టైటిల్ రోల్‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్‌గా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఓ స్టూడెంట్ పై బౌన్సర్ దాడి చేశాడు. ఇదే విషయంపై రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.
రాఘవ లారెన్స్ ట్వీట్ చేస్తూ.. చంద్రముఖి2 సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా బౌన్సర్‌లలో ఒకరు కాలేజీ స్టూడెంట్‌తో గొడవకు దిగిన దురదృష్టకర సంఘటన గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ముందుగా ఈ సంఘటన గురించి నాకు లేదా నిర్వాహకులకు తెలియదు, ఎందుకంటే హాలులో ఈవెంట్ జరుగుతున్నప్పుడు బయట ఇన్సెడెంట్ జరిగినట్లు సమాచారం.
నేను స్టూడెంట్స్ ని ఎంతగా ప్రేమిస్తానో..వారు లైఫ్లో ఎదగాలని నేను ఎంతగా కోరుకుంటున్నానో అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టూడెంట్ విషయంలో ఇలా జరగకూడదు. ఆ సమయంలో జరిగిన దానికి నేను వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నాను. కారణం ఏమైనప్పటికీ, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టడం తప్పు. ఇకపై ఇలాంటి ఇన్సెడెంట్స్ జరగకుండా చూడాలని బౌన్సర్లకు విజ్ఞప్తి చేస్తున్నా..అని సూచించారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, లక్ష్మీ మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, వడివేలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రజినీకాంత్ నటించిన చంద్రముఖి మూవీకి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ వినాయక చవితి స్పెషల్ గా సెప్టెంబర్ 19న తమిళంతో పాటు తెలుగు,కన్నడ,మలయాళ,హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Hello everyone, I just came to know about the unfortunate incident which happened during our #Chandramukhi2 movie Audio Launch, where one of the Bouncers involved in a fist fight with a college student.
— Raghava Lawrence (@offl_Lawrence) August 27, 2023
First of all myself or the organisers were not aware of this incident as it…