కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లీడర్లలో భయం: రఘునందన్

కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లీడర్లలో భయం: రఘునందన్

ఫాం హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఓకే చెబుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే రఘునందన్ రావు స్వాగతించారు. కోర్టు తీర్పుతో దొంగలు ఎవరో బయటపడతారన్న భయం బీఆర్ఎస్ లీడర్లలో మొదలైందని అన్నారు. తప్పు చేయనప్పుడు సీఎం కేసీఆర్ సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఫాం హౌస్ కేసులో దొరికిన రూ.15కోట్లతో పాటు రెడ్ కలర్ కారు ఏమయ్యాయన్న రఘునందన్.. అసలు ఆ కారు ఎవరిదో చెప్పాలని  డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు వివరాలు సీఎం టేబుల్ పైకి చేరడంపై ఆయన అనుమానం వ్యక్తంచేశారు. 
బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో సైతం మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని రఘునందన్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేని ఆరోపిస్తున్న ఎంపీలు పార్లమెంటులో ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక, గజ్వేల్ కు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు.