
మామ మాటలకు అల్లుడి భజన సరిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బడ్జెట్ అంకెల గారడి తప్పా ఏమీ లేదన్నారు. గల్ఫ్ కార్మికులకు బడ్జెట్ కేటాయింపులు దారుణమన్నారు. ఉద్యమానికి కీలక పనిచేసిన ఓయూ, కేయూలకు ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. ఏపీ ఎప్పుడో పీఆర్సీ ఇస్తే..ఇక్కడ పీఆర్సీ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతిపై కూడా పైసా ఇవ్వలేదన్నారు. ఎన్నికల వేళ మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. తమకు సభలో మాట్లాడే టైం ఇవ్వడం లేదన్నారు.