కవితకు పూలే విగ్రహం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా : రఘునందన్ రావు

కవితకు పూలే విగ్రహం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా : రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారంలో ఉన్నప్పుడు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదని విమర్శించారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని కేసీఆర్ ను అడగండని కవితకు సూచించారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి మీ పాపాలు కడుక్కోండన్నారు. మీ నాన్న ఆరోగ్యం ఎలాగూ బాగోలేదు కదా.. కాబట్టి ఫ్లోర్ లీడర్ గా సీనియర్ అయిన, దళితుడు అయిన కడియం కు ఇవ్వండని రఘునందన్‌ రావు అన్నారు.  

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బీసీకి అవకాశం ఉవ్వండని రఘునందన్ రావు సూచించారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఇంకా పబ్లిసిటీ పిచ్చి ఎందుకు అని ఆయన విమర్శించారు. కవిత ఉన్న లేకున్న పూలే గుర్తుంటారని అన్నారు. మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదన్నారు. మీ పార్టీ పేరులో ఎలాగూ తెలంగాణ పోయిందని, కనీసం సీట్లు అయినా తెలంగాణ కోసం కొట్లాడిన వారికి ఇవ్వండని రఘునందన్ రావు అన్నారు.