
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం పోటీ చేసే దమ్ముందా? అని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు ప్ర శ్నించారు. బీఆర్ఎస్ కు చేతనైతే ఒక్క సీటు తెచ్చుకోవాలని ఓపెన్ చాలెంజ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవీలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులికాదు, పిల్లి అంతకన్నా కాదు ఎలుక అని రఘునందన్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు. గెలిచే దమ్ములేకే బీఆర్ఎస్ టికెట్లను సొమ్ముచేసుకుంటున్నరు. మోదీ అంటేనే కేసీఆర్ దూరం.. రేవంత్ అడగ్గానే కేంద్రం ఐపీఎస్ లను ఇచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు తామే గెలుచుకుంటామన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు ఎవరూ పోటీ చేసినా గెలవరన్నారు.
బీఆర్ఎస్లో పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. రూ.100 కోట్లు ఇచ్చిన వారికే టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు రఘునందన్ రావు. అధికారం కోల్పోయినా కేటీఆర్ కు అహంకారం తగ్గలేదు. బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. మెదక్ లో బీజేపీ ఉందో.. లేదో.. హరీశ్రావుకు పార్ల మెంట్ ఎన్నికల్లో ప్రజలు చూపిస్తరు. గతంలో కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు. నీటి ఒప్పందాలపై ఆనాడు కుట్ర చేయలేదా? కృష్ణా నీటి ఒప్పందాలపై సంతకం చేసిందెవరు. బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నరు. మోటార్లకు మీటర్లు అంటూ దుష్ప్రచారం చేశారు. రాష్ట్రంలోని ఐదు పార్టీలూ కలిసి పోటీ చేయాలి' అని రఘునందన్ సవాల్ విసిరారు.