ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారో స్పష్టంగా చెప్పాలి

ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారో స్పష్టంగా చెప్పాలి

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారో స్పష్టంగా తెలపాలన్నారు. ప్రతీ నియోజక వర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. నియోజక వర్గానికి 100 పడకల హాస్పిటల్ కట్టిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. గాంధీ, నిమ్స్ హాస్పిటల్ లో పని చేస్తున్న పారా మెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలన్నారు. దేవాలయాలకు దేవ దూప నైవేద్యాలకు గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల రూపాయలు, పట్టణాల్లో రూ.15 వేలకు పెంచాలన్నారు. పేద బ్రాహ్మణులను ఆదుకోవాలన్నారు. దేవాదాయ భూములు ఎక్కడ ఉన్నా వాటిని స్వాధీనం  చేసుకొని దేవస్థానాలకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.