అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎక్స్ టర్నల్ అడ్వయిజరీ గ్రూప్‌లోకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను ఆహ్వనించినట్లు IMF MD క్రిస్టలినా జార్జివా తెలిపారు. IMF తన సభ్యదేశాకు సరైన సమయంలో సలహాలు సూచనలు ఇవ్వాలంటే తమకు నిపుణులైన వారి నుండి సరైన సూచనలు రావాల్సి ఉంది. ఆ కారణంగానే రఘురాం రాజన్ ను ఆహ్వానించామని చెప్పారు క్రిస్టలినా. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా మూడేళ్లు సేవలందించి 2016 లో తన పదవికి రాజీనామా చేసిన రాజన్… ఆ తర్వాత యూనివర్శిటి ఆఫ్ చికాగోలో ప్రోఫెసర్ గా కొనసాగుతున్నారు.

