రఘురామ్ రాజన్తో బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం

రఘురామ్ రాజన్తో  బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌‌ రాజన్ తన పదవీ కాలంలో  దేశ బ్యాంకింగ్‌‌ వ్యవస్థను నాశనం చేశారని యూనియన్ మినిస్టర్ రాజీవ్‌‌ చంద్రశేఖర్ ఆరోపించారు.  శుక్రవారం ఓ ప్రెస్ కాన్ఫెరెన్స్‌‌లో పాల్గొన్న ఆయన  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఉన్న జాబ్స్​కు ఎటువంటి ప్రమాదం కాదని కూడా పేర్కొన్నారు.

‘అతను పొలిటిషియనో..ఫెయిల్డ్‌‌ పొలిటిషియనో లేదా ఫెయిల్డ్ ఎకనామిస్టో నిర్ణయించుకోవాలి. తను ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌గా ఉన్నప్పుడు దేశ బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌ను నాశనం చేశాడని అందరికీ తెలిసిందే’ అని రాజీవ్ పేర్కొన్నారు.  కిందటి వారం ఐటీ మినిస్టర్‌‌‌‌ అశ్వినీ వైష్ణవ్‌‌ కూడా రఘురామ్‌‌ రాజన్‌‌పై విరుచుకుపడ్డారు. కొన్ని సెక్టార్లలో గ్రోత్‌‌ ఎలా ఉంటుందో కూడా ఆయన తెలియదని అన్నారు.