రేవంత్ నీకు నాలాంటోడి ఉసురు తగులుతుంది.. లక్ష్మారెడ్డి కంటతడి

రేవంత్  నీకు నాలాంటోడి ఉసురు తగులుతుంది..  లక్ష్మారెడ్డి కంటతడి

55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ లో అప్పుడే  అలకలు మొదలయ్యాయి.  టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా ఒక్కోకరిగా ఆ పార్టీని వీడుతున్నారు.  తాజాగా ఉప్పల్‌ కాంగ్రెస్‌ నేత రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ కు  రాజీనామా చేశారు. ఉప్పల్ టికెట్ ఆశించిన లక్ష్మారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడతున్నట్లుగా ప్రకటించారు.  

ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ పై లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.  25 ఏళ్లుగా పార్టీకి పని చేస్తే గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు ఏ పదవి వద్దని  పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. నాలాంటి వాడి ఉసురు తప్పకుండా తగలుతుందని లక్ష్మారెడ్డి కంటతడిపెట్టారు. రేవంత్ పార్టీలో  నియంతలా వ్యవహరిస్తున్నాడని, డబ్బులకు ఓట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు.  

రేవంత్ తనని కూడా డబ్బులు ఆడిగారని. తాను ఇవ్వక పోవడం వల్లే తనపై కక్ష పెంచుకోని టికెట్ రాకుండా చేసాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.