భారత్ లో రెండు రోజుల పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటించనున్నారు. పుతిన్ భారత్ పర్యటన సందర్బంగా ద్వైపాక్షిక నిర్ణయాలు, సమావేశాలతో పాటు ఆయన నివసించే హోటల్స్, భద్రత, తినే ఆహారం వంటి విషయాలపైన ఆసక్తి నెలకొంది. పుతిన్ వస్తున్నాడని ఆయన బస చేయనున్న హోటల్స్ దగ్గర ఇప్పటికే సందడి మొదలైంది. భారత్ లో పుతిన్ పర్యటన సందర్భంగా ఢిల్లీలో ఆయన బస చేసే హోటల్, ఢిల్లీలోభద్రత వంటి అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్బంగా న్యూఢిల్లీలో ఆయన బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్ వైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.హోటల్ లోని చాణక్య సూట్ లో పుతిన్ బస చేయనున్నారు. హోటల్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతలో ఉంది. అన్ని రూములు బుక్కయ్యాయి. హోటర్ కారిడార్ మొత్తం బారీకేడ్లతో నిండిపోయింది. ఎంట్రీ పాయింట్స్ అన్నీ సీలు చేశారు.
►ALSO READ | అద్దె కాదు.. ఈ ఇల్లు మీదే..: తల్లిదండ్రులకి కొడుకు ఊహించని గిఫ్ట్.. పేరెంట్స్ కల నెరవేర్చెశాడుగా..
పుతిన్ బస చేసే ఐటీసీ మౌర్య హోటల్ అంత్యంత విలాసవంతమైన స్టార్ హోటల్. పుతిన్ ఛాణక్య సూట్ లో బసచేయనున్నారు. హోటల్ లోని చంద్ర గుప్త సూట్ లతో పోలిస్తే ఇది విలాసవంతమైన సూట్. ఆ హోటల్ కే హైలైట్ ఈ సూట్. దాదాపు 4వేల 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సూట్.. ఒక్క రాత్రికి దాదాపు రూ.8–10 లక్షలు వసూలు చేస్తుంది. ఈ చాణక్య సూట్ హోటల్ భారతీయ హుందాతనం, సంస్కృతి కళల వారసత్వ శైలి వైభవంతో పాటు ఆధునికత ప్రతిబింబిస్తుంది.
ఢిల్లీ లో ఎక్కడ చూసిన ఫుల్ సెక్యూరిటీ, భారీ బందోబస్తు కనిపిస్తోంది. పుతిన్ పర్యటనతో ఢిల్లీ లోని అన్ని హోటల్స్ రద్దీగా మారాయి.. పుతిన్ తో పాటు వచ్చే ప్రతినిధులకు ఆతిధ్యం ఇస్తున్న ఢిల్లీ హోటల్స్ ఇప్పుడు ఫుల్ అయ్యిపోయాయి. హోటల్స్ రేట్లను కూడా అమాంతం పెంచాయి.
