అద్దె కాదు.. ఈ ఇల్లు మీదే..: తల్లిదండ్రులకి కొడుకు ఊహించని గిఫ్ట్.. పేరెంట్స్ కల నెరవేర్చెశాడుగా..

అద్దె కాదు.. ఈ ఇల్లు మీదే..: తల్లిదండ్రులకి కొడుకు ఊహించని గిఫ్ట్.. పేరెంట్స్ కల నెరవేర్చెశాడుగా..

ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. కొడుకు ఇచ్చిన కొత్త ఫ్లాట్‌ను చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

 ఈ వైరల్ వీడియోలో మొదట అతని తల్లిదండ్రులు కొత్తగా అద్దెకు తీసుకున్నామనుకుని ఒక అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెడతారు. కానీ కొద్దిసేపటికే వారికి పెద్ద సర్ప్రైజ్ తెలుస్తుంది. కొడుకు ఆశిష్ జైన్ ఆ ఇంటి పేపర్స్, వారి పేర్లు ఉన్న ఇంటి నేమ్‌ప్లేట్‌ను చూపించి.. ఈ ఇల్లు ఇకపై మీదే అని చెప్తాడు.

►ALSO READ | ఇలాంటి సైకోలు కూడా ఉంటారా.. ? తనకంటే ఎవరూ అందంగా ఉండొద్దని చిన్న పిల్లలను చంపేసింది.. !

ఆశ్చర్యంలో అతని తల్లిదండ్రులు మొదట నమ్మకపోగా... కానీ, ఇంటి పేపర్ల పై ఉన్న వారి పేర్లు, గుమ్మం పక్కన ఉండే నేమ్‌ప్లేట్ చూసి వారికి అసలు విషయం అర్థమవుతుంది. దింతో ఆ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన తండ్రి, కొడుకును గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా  స్టెప్స్  వేస్తాడు. తల్లి మొదట మౌనంగా ఆశ్చర్యపోయి, తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకును హత్తుకుంటుంది. ఆశిష్ జైన్ వారికి ఇంటి తాళాలు ఇచ్చి మెల్లగా “యే ఘర్ ఆప్కా హై” (ఈ ఇల్లు మీదే) అని చెప్పాడు. ఈ మాటలు వీడియోకు హైలైట్‌గా మారింది.  
 
 నెటిజన్ల ప్రశంసలు: ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశిష్ జైన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. తన తల్లిదండ్రులను ఇంత గొప్పగా సంతోషపెట్టినందుకు అందరూ మెచ్చుకున్నారు. చాలామంది దీన్ని 'ప్రతి పేరెంట్స్ కల' అని అన్నారు. ఒకరు "ఆ తండ్రి ఎమోషన్స్ నిజంగా బంగారం కంటే విలువైనవి" అని కామెంట్ చేయగా... మరొకరు "అమ్మ రియాక్షన్.. అమూల్యం" అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా వైరల్ అవుతుంది.