ఇలాంటి సైకోలు కూడా ఉంటారా.. ? తనకంటే ఎవరూ అందంగా ఉండొద్దని చిన్న పిల్లలను చంపేసింది.. !

ఇలాంటి సైకోలు కూడా ఉంటారా.. ? తనకంటే ఎవరూ అందంగా ఉండొద్దని చిన్న పిల్లలను చంపేసింది.. !

సైకో పాత్ సినిమాలు చూసే ఉంటారు. ఈ డిజార్డర్ ఉన్న వాళ్లు సమాజానికి చాలా ప్రమాదకరం. మనుషులను చంపేందుకు వీళ్లకు పెద్దగా కారణాలంటూ ఏం ఉండవ్. అహం చల్లార్చుకోవడానికి హత్యలు చేస్తుంటారు. హత్యలు చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. పైగా.. హత్యలు చేసేందుకు వీళ్లు చెప్పే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. హర్యానాకు చెందిన ఈ సీరియల్ కిల్లర్ పూనమ్ కూడా అలాంటి సైకో పాత్ అని తెలిసి ఆ రాష్ట్రం వణికిపోయింది. ఆమె చేసిన అకృత్యం అలాంటిది మరి. రెండేళ్లలో నలుగురు చిన్నారులను చంపేసింది. ఈమె చంపేసిన నలుగురిలో పూనమ్ కన్న కొడుకు కూడా ఉన్నాడంటే మెంటాలిటీ ఎంత వికృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన ఫ్యామిలీలో తన కంటే అందంగా ఎవరూ ఉండకూడదని చంపేశానని ఈమె ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు విస్తుపోయారు.

తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదనే సైకిక్ మెంటాలిటీ ఉన్న పూనమ్ గత రెండేళ్లలో నలుగురు చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఆ నలుగురు చిన్నారుల్లో తన మూడేళ్ళ కొడుకు కూడా ఉండటం మరో షాకింగ్ అంశం. 32 ఏళ్ళ పూనమ్ అనే సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పానిపట్ కు చెందిన పూనమ్ ను వరుస హత్యల కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదు అన్న విపరీత ధోరణి కలిగిన పూనమ్ వరుస హత్యలు చేసిందని తెలిపారు పోలీసులు.

నిందితురాలు పూనమ్ 2023 నుంచి 2025 వరకు తన కుటుంబంలోని పిల్లలను, తన బంధువులను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేసిందని తెలిపారు పోలీసులు. పూనమ్ ఒక మానసిక రోగి అని.. తన కుటుంబంలో ఏ బిడ్డ తనకంటే అందంగా ఉండకూడదని ఆమె భావించేదని విచారణలో తేలినట్లు తెలిపారు పోలీసులు. 

►ALSO READ | రసగుల్లా కోసం కొట్టుకున్నారు: గాల్లోకి కుర్చీలు విసురుతు రచ్చరచ్చ.. ఆగిపోయిన పెళ్లి..

పూనమ్ వరుస హత్యలు 2023లో జరిగిన ఘటనతో మొదలయ్యాయని తెలిపారు పోలీసులు. 2023లో సోనీపట్ లోని భవార్ గ్రామంలో పూనమ్ తన వదిన కూతురుని నీటిలో ముంచి చంపిందని తెలిపారు పోలీసులు. అనుమానం రాకుండా ఉండటానికి, ఆమె తన సొంత మూడేళ్ల కుమారుడిని కూడా చంపిందని, దీనితో మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు అందరిని నమ్మించిందని తెలిపారు పోలీసులు. ఆగస్టు 2025లో, సేవా గ్రామంలో తన బంధువు ఆరేళ్ల కుమార్తెను కూడా అదే తరహాలో చంపిందని తెలిపారు పోలీసులు.

డిసెంబర్ 1, 2025 పానిపట్ లోని నౌలఖా గ్రామంలో ఒక పెళ్ళిలో జరిగిన ఘటన ద్వారా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్ళిలో పూనమ్ మేనకోడలు విధి అనుమానాస్పదంగా మృతి చెందటంతో పోలీసులు విచారణ చేపట్టారు. విధి నీటి తొట్టిలో పడి మృతి చెందింది. అయితే ఆ నీటి తొట్టి లాక్ చేసి ఉండటంతో.. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని అనుమానం వచ్చింది పోలీసులకు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పూనమ్ హత్య చేసినట్లు నిర్దారించారు.

మొత్తానికి పూనమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తమ స్టైల్ లో విచారించగా.. ఆ నాలుగు హత్యలు తానే చేసినట్లు ఒప్పుకుంది. అంతే కాదు.. పూనమ్ MA పొలిటికల్ సైన్స్ చదివిందని.. హత్యలు చేసిన తర్వాత ఒంటరిగా సెలెబ్రేట్ చేసుకునే పైశాచికత్వం కూడా ఉందని తెలిపారు పోలీసులు.