వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డేట్.. వారికే ఎక్కువ సమయం దర్శనాలు..!

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డేట్.. వారికే ఎక్కువ సమయం దర్శనాలు..!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది టీటీడీ. 182 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించింది టీటీడీ. శుక్రవారం ( డిసెంబర్ 5 ) తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు వివరాలు వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో ముఖ్యాంశాలు:

  • నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం.
  • వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట
  • డిసెంబర్ 30 నుండి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
  • పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయింపు.
  • ఈ పది రోజులకు గానూ 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు.
  • డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ.
  • న‌వంబ‌ర్ 27 నుండి డిసెంబ‌ర్ 1వ తేది వ‌ర‌కు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు.
  • డిసెంబర్ 02వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు.
  • మొదటి మూడు రోజులు S.E.D., శ్రీవాణి దర్శనాలు రద్దు. మిగిలిన 7 రోజులకుగాను ఈరోజు (5వ తేదీ )ఉదయం 10 గం.లకు శ్రీవాణి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గం.లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం. (రోజుకు శ్రీవాణి దర్శనం - 1,000, SED - 15,000).
  • జనవరి 02 నుండి 08వ తేదీ వరకు VQC - 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం.
  • ఈ 10 రోజులలో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు.
  • ఈ 10 రోజులలో ప్రత్యేక దర్శనాలు రద్దు.
  • స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం.
  • దాతలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం.
  • జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌద‌రి, సీవీఎస్వో శ్రీ ముర‌ళీ కృష్ణ‌, సిఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.