నిరుద్యోగులను కేసీఆర్ ​రోడ్డున పడేసిన్రు.. 

నిరుద్యోగులను కేసీఆర్ ​రోడ్డున పడేసిన్రు.. 

గజ్వేల్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డున పడ్డరు.. కేసీఆర్​ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్​ రావు విమర్శించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం అనంతగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో మాట్లాడారు. ఎన్నికలప్పుడు కేసీఆర్​ ఇచ్చిన వగ్దానాలన్నీ తప్పుడువేనని, దళిత సీఎం, డబుల్​బెడ్​ఇండ్లు ఇలా ఏ ఒక్క హామీ సరిగా అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. 

ధరణి పేరుతో బీఆర్ఎస్​ లీడర్ల భూదందా

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: ధరణి పేరుతో బీఆర్ఎస్​ లీడర్లు భూదందా చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్​ రావు ఆరోపించారు. కౌడిపల్లి  మండలం తిమ్మాపూర్​లో సోమవారం రాత్రి జరిగిన బీజేపీ కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. నర్సాపూర్​ నియోజకవర్గంలోని మండలాల్లో అధికార పార్టీ ల​లీడర్లు సర్వే నంబర్లు మార్చి పేదల భూములు లాక్కుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారని, ఇది ఎమ్మెల్యే మదన్​రెడ్డి అండదండలతోనే జరుగుతోందని ఆరోపించారు. 

బీఆర్ఎస్ ది ప్రజా వ్యతిరేక పాలన..

నారాయణ్ ఖేడ్, వెలుగు: బీఆర్ఎస్ ది ప్రజా వ్యతిరేక పరిపాలన అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండల పరిధిలోని హనుమంత రావు పేటతో పలు గ్రామాలలో, ఖేడ్ పట్టణంలోని అప్పారావు సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్​లో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జి రవి కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతందని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్ సర్కారుకు చరమగీతం పాడుదాం

నర్సాపూర్, వెలుగు : ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్​ సర్కారుకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని నర్సాపూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేశ్​ గౌడ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ  భరోసా శక్తి కేంద్రం ఇన్​చార్జి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగయ్యపల్లి గోపితో కలిసి ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు.