రామప్పలో 6 గ్యారంటీల కార్డుకు పూజలు చేసిన రాహుల్, ప్రియాంక

రామప్పలో 6 గ్యారంటీల కార్డుకు పూజలు చేసిన రాహుల్, ప్రియాంక

రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరు గ్యారంటీల కార్డుకు శివుడి ముందు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రామప్ప ఆలయ ప్రత్యేకతను రాహుల్, ప్రియంకలకు వివరించారు. రామప్ప ఆలయ స్థంబాలపై ఉన్న శిల్పకళాకృతుల గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

2023 అక్టోబర్ 18న బుధవారం సాయంత్రం తొలి విడత బస్సు యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ములుగు బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు. మహిళ డిక్లరేషన్ ను కాంగ్రెస్ నేతలు ప్రకటించనున్నారు. ఇవాళ ములుగు, భూపాలపల్లి బస్సుయాత్రలో పాల్గొనున్న రాహుల్, ప్రియాంక, రాత్రి భూపాలపల్లిలోనే బస చేయనున్నారు.