ఆ ఇద్దరి వల్లే గెలుపు దూరమైంది..వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కారణం చెప్పిన ద్రవిడ్

ఆ ఇద్దరి వల్లే గెలుపు దూరమైంది..వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కారణం చెప్పిన ద్రవిడ్

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతన్నారు. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు సొంత గడ్డపై ఈ సారి కప్ కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరిందింది. అయితే ఈ ఫైనల్లో భారత్ ఓడిపోవడానికి అసలు కారణమేంటో ద్రవిడ్ తాజాగా తెలియజేశాడు.

శనివారం (డిసెంబర్ 2) జైషా నేతృత్వంలోని బీసీసీఐ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో టీమిండియా హెడ్ కోచ్ కు వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి అసలు కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు ద్రవిడ్ వ్యక్తిగతంగా ఎవరి పేరు చెప్పకుండా పిచ్ ని తప్పు పట్టాడు. మేము ఊహించినట్టుగా పిచ్ లేదని.. అసలు బంతి టర్న్ కాలేదని వ్యాఖ్యానించాడు. అహ్మదాబాద్ పిచ్ మన స్పిన్నర్లకు సహకరించలేదని.. ఈ కారణంగానే మనకు గెలుపు దూరమైందని ద్రవిడ్ బీసీసీఐ సెక్రటరీ జైషాకు వివరించాడు. దీంతో జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ తిప్పలేకపోవడం వలనే ఓడిపోయిందని ద్రవిడ్ పరోక్షంగా తెలియజేశాడు.              

ఈ సందర్భంగా ఫైనల్ కు మీరు ఎలాంటి ప్రణాళికతో వెళ్లారు అనే ప్రశ్నకు ద్రవిడ్ అడగగా.. ఫైనల్ కు ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదని.. వరుసగా 10 మ్యాచులు గెలిచామనే ఆత్మ విశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టామని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఈ ఫైనల్లో టాస్ గెలిచి ఆసీస్ బౌలింగ్ ఎంచుకోవడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. అహ్మదాబాద్ ట్రాక్ పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు పిచ్ సహకరించకపోగా ఛేజింగ్ లో బౌలింగ్ కు కష్టంగా మారింది. దీంతో ఆస్ట్రేలియా సునాయాస విజయం సాధించింది.