మోడీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడింది

మోడీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడింది

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సర్కారు దేశద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. పెగాసస్ స్పైవేర్ ద్వారా మన ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక సంస్థలతో పాటు రాజకీయ నేతలు, ప్రజలపై కేంద్రం గూఢచర్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రతిపక్ష నాయకులు, సైనిక దళాలు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేసిందని ట్వీట్ చేశారు. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఈ ట్వీట్ కు జత చేశారు. 

కాగా, గతేడాది మొత్తం దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ ను 2017లో ఇజ్రాయెల్ నుంచి భారత్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు ఈ డీల్ ను కూడా కుదుర్చుకుందని తెలిపింది. పెగాసస్ తయారీ సంస్థ ఎస్ఎస్వోతో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్ర సర్కారు చెప్పిన నేపథ్యంలో తాజా కథనం సంచలనాత్మకంగా మారింది. 

మరిన్ని వార్తల  కోసం:

మహిళా కమిషన్ నోటీసులు.. రూల్స్ మార్చిన ఎస్బీఐ

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు