ప్రధానిని ప్రశ్నించొద్దనే.. మత ఘర్షణలు : రాహుల్ గాంధీ

ప్రధానిని ప్రశ్నించొద్దనే.. మత ఘర్షణలు : రాహుల్ గాంధీ
  • రాహుల్​ గాంధీ ఆరోపణలు 

న్యూఢిల్లీ: దేశ రక్షణ, ఇంధన భద్రత, సార్వభౌమాధికారాన్ని ప్రధాని  నరేంద్ర మోదీ అమెరికాకు  అప్పగిస్తున్నాని.. దీనిపై ప్రజలు ప్రశ్నించొద్దనే హిందూ-ముస్లిం ఘర్షణలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో అల్లర్ల వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 

ఈ నెల 4న హోలీ వేడుకల సమయంలో వాటర్​ బెలూన్ ​పొరుగువారిపై పడటంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలై, చివరకు తరుణ్ కుమార్(26) హత్యకు దారితీసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గురువారం ‘ఎక్స్​’ వేదికగా స్పందించారు.