కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేయడం వివాదాస్పదమైంది. రావణుడి గెటప్ లో రాహుల్ గాంధీ ఫోటోను బీజేపీ మార్ఫింగ్ చేసింది. ఈ ఫోటోను బీజేపీ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
రాహుల్ గాంధీని బీజేపీ రావణుడిగా మార్చింది. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసింది. ఆది పురుష్ లోని సైఫ్ ఆలీ ఖాన్ రావణుడి గెటప్ ఫోటోను తీసుకుని..ఆ ఫోటోకు రాహుల్ గాంధీ ఫోటోను యాడ్ చేసింది. మొత్తం పది తలల రావణుడు ఫోటోకు రాహుల్ గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టర్‌పై రావణ్, ఎ కాంగ్రెస్ పార్టీ ప్రొడెక్షన్.. దర్శకత్వం జార్జ్ సోరోస్’ అని కామెంట్ చేసింది. కొత్త యుగం రావణుడు ఉన్నాడు. అతడో రాక్షసుడు. ధర్మానికి వ్యతిరేకి. రాముడికి వ్యతిరేకి. భారత్‌ను నాశనం చేయడమే అతడి లక్ష్యం’ అంటూ బీజేపీ పోస్టులో రాసింది.
The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB
— BJP (@BJP4India) October 5, 2023
బీజేపీ జార్జ్ సోరోస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. జార్జ్ సోరోస్ ప్రఖ్యాత హంగేరియన్- అమెరికన్ వ్యాపారవేత్త. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రూప్‌లకు భారీ విరాళాలు ఇస్తూ.. ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారని బీజేపీ ఆరోపిస్తోంది.
- ALSO READ | నోబెల్ప్రకటనకు ముందే లీకుల కలకలం
బీజేపీ పోస్ట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. దేశంలో హింసను ప్రేరేపించడానికి, రెచ్చగొట్టడానికి బీజేపీ రాహుల్ గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరించడానికి ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీ దేశాన్ని విభజించాలనుకునే శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారని జైరాం రమేష్ గుర్తు చేశారు. ఇది కరెక్ట్ కాదని బీజేపీకి హితవు పలికారు.

