
బిహార్: మోడీ సర్కార్ ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమి లేదన్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. యువతకు ఉపాధి కల్పన, రైతులకు సాయం చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ చేపడుతామన్నారు. న్యాయ్ పథకంతో నేరుగా నగదు అందించి పేదలను ఆదుకుంటామని చెప్పారు. బీహార్ లోని పట్నా సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.