ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ.. జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం

ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ.. జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. 2025 మే 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఢిల్లీలోని మోదీ ఆఫీస్లో ఈ భేటీ జరిగింది. మోదీ, రాహుల్ గాంధీ అధికారికంగా సమావేశం కావడంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకంపై రాహుల్ గాంధీ, మోదీ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో మోదీ, రాహుల్ గాంధీతో పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు.

ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్గా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. మే 2023లో రెండేళ్ల పదవీ కాలంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మే 2025తో ఆ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకంపై రాహుల్ గాంధీతో, సీజేఐతో ప్రధాని మోదీ చర్చించారు.

►ALSO READ | మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరుఫున నందిని గుప్తా.. అందాల సుందరీ బ్యాక్ గ్రౌండ్ ఇదే