అజార్ ను వదిలేసింది మీరు కాదా?: రాహుల్

అజార్ ను వదిలేసింది మీరు కాదా?: రాహుల్
  • టెర్రరిస్టులతో చర్చలు జరిపింది, వారి ముందు తల వంచింది మీరేగా
  • బీజేపీలా కాంగ్రెస్ ఎప్పుడూ టెర్రరిస్టులను వదల్లేదు
  • ఆర్మీ.. మోడీ సొంతప్రాపర్టీ కాదు, ఇండియాది
  • ఆర్మీ విజయాలు కాదు..మీరేం చేశారో ప్రజలకు చెప్పండి
  • బీజేపీకి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్

‘‘జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను పాకిస్థాన్ కు పంపింది ఎవరు? అతను ఇండియా జైలు నుంచి అక్కడికి ఎలా వెళ్లా డు? కాంగ్రెస్ పంపిందా? టెర్రరిస్టులతో చర్చలు జరిపిందెవరు? వారి ముందు తలవంచిందెవరు?” అని బీజేపీని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిలదీశారు. ఇండియా జైల్లో ఉన్న అజార్ ను విడుదల చేసింది ఒకప్పటి ఎన్డీయే ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా యూనైటెడ్ నేషన్స్ ప్రకటించడం తమ విజయమేనని బీజేపీ చెప్పుకోవడంపై మండిపడ్డారు. టెర్రరిజంపై పోరు విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ పడిందని ఆరోపించారు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వా ర్టర్స్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ మాట్లాడారు. టెర్రరిజం అనేది చాలా పెద్ద అంశమని,ఉగ్రవాదాన్ని మోడీ కన్నా కఠినంగా కాంగ్రెస్ డీల్ చేస్తుందని రాహుల్ చెప్పారు. ‘‘అజార్ ను కాంగ్రెస్ వదల్లేదు. నిజమేంటంటే.. బీజేపీ (టెర్రరిజం విషయంలో) కాంప్రమైజ్ అయింది. కానీ కాంగ్రెస్ అలాంటివి ఎన్నడూ చేయలేదు. మీలాగా కాంగ్రెస్ ఎప్పుడూ టెర్రరిస్టులను పాక్ పంపలేదు. ఇకనైనా అలాంటివి చేయదు” అని స్పష్టం చేశారు.

ఆర్మీవి వీడియో గేమ్సా?

ఇండియన్ ఆర్మీ.. మోడీ సొంత ప్రాపర్టీ కాదని రాహుల్ విమర్శించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్  తన సొంత ప్రాపర్టీలని ఆయన భావిస్తున్నట్లున్నారని అని ఎగతాళి చేశారు. పొలిటికల్ మైలేజీ కోసం సెక్యూరిటీ ఫోర్సెస్ ను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఆరుసార్లు సర్జికల్ స్ర్టైక్స్ చేశామని ప్రకటించడంపై  స్పం దిస్తూ.. ‘సర్జికల్ స్ట్రైక్స్ ను కాంగ్రెస్ చేయలేదు. ఆర్మీ చేసింది’ అని చెప్పారు. యూపీఏ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదని, వీడియో గేమ్స్ అని మాట్లా డి ఆర్మీని మోడీ అవమానించారన్నారు.“మా హయాంలో జరిగిన  సర్జికల్ స్ట్రైక్స్ ను వీడియోగేమ్స్  అని మోడీ అంటున్నారు. అయన అవమానిస్తున్నది కాంగ్రెస్ ను కాదు.. ఇండియన్ ఆర్మీని” అని చెప్పారు. ‘‘స్ట్రైక్స్ ఆర్మీ చేసింది. అది వారి డ్యూటీ.మేం ఆర్మీని రాజకీయం చేయలేదు. ఎందుకంటే అది ఇండియన్ ఆర్మీ. ఎవరో ఓ వ్యక్తికి చెందిన ఆర్మీకాదు. ప్రధానికి ఆర్మీపై  గౌరవం ఉండాలి. అవమానించొద్దు” అని రాహుల్ హితవు పలికారు.

మీరేం చేశారో చెప్పండి

ఆర్మీ విజయాలను బీజేపీ క్రెడిట్ చేసుకోవడాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగం,  రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘గత 70 ఏళ్లుగా ఆర్మీ తన పని తాను చేసుకుని పోతోంది. ఆర్మీ గురించి కాకుండా మోడీ చేసిన వాటి గురించి చెప్పుకుంటే మంచిది. యువత, రైతులు, మహిళల కోసం ఆయన ఏం చేశారో చెప్పుకోవాలి” అని సూచించారు. మోడీ భయపడుతున్నారు..

లోక్ సభ ఎన్ని కల్లో బీజేపీ ఓడిపోతుందని రాహుల్ అన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన నాలుగు దశల ఎన్నికలపై పార్టీ రహస్య సర్వేలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు మోడీ భయపడుతున్నారని చెప్పారు. ‘‘మోడీని ఎవరూ ఓడించలేరని ఐదేళ్ల కిందట అన్నారు. 10 నుంచి 15 ఏళ్లపాటు వాళ్లదే అధికారం అని కూడా అన్నారు. కానీ కాంగ్రెస్ ఆయన్ను పడగొట్టింది. 10 నుంచి 15 రోజుల్లో మొత్తం కూలిపోతుం ది’’ అని జోస్యం చెప్పారు. ‘‘బీజేపీ  ఓడిపోతున్నదని అంతర్లీనంగా తెలుస్తోంది. ఆ పార్టీ భయాందోళనతో క్యాంపెయిన్ చేసింది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు భయపడుతున్న ప్రధానిని ఇప్పుడు చూస్తున్నా. తాను మళ్లీ గెలవలేనని అర్థం చేసుకున్న ప్రధానిని చూస్తున్నా”అని అన్నారు.

రాఫెల్ పై చర్చకు రెడీ

చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అనే నినాదాన్ని సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై  రాహుల్ స్పందిస్తూ, ‘‘నేను కోర్టుకు ఇప్పటికే క్షమాపణ చెప్పాను. ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తోంది” అని వివరించారు.

న్యాయ్ రీమానిటైజ్ చేస్తుంది

మోడీ ఎకానమీని డీమానిటైజ్ చేశారని, తమ న్యాయ్ యోజన దాన్ని రీమానిటైజ్ చేస్తుందని రాహుల్ చెప్పా రు. ‘‘నోట్ల రద్దు వల్ల ప్రజల చేతుల్లో డబ్బులు లేక ఏమీ కొనలేదు. కొనుగోళ్లు లేక ఫ్యాక్టరీలు మూతబడ్డాయి . ఉద్యోగా లు పోయాయి. నిరుద్యోగం పెరిగింది. న్యాయ్ యోజన ద్వారా ప్రజలకు డబ్బు అందగానే.. వారు కొనడం  మొదలు పెడతారు. షాపులకు డిమాండ్ పెరుగుతుం ది. ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయి , ఉత్పత్తులు పెరుగుతాయి. మరిన్నిఉద్యోగా లు దొరుకుతాయి” అని అన్నారు.

మీడియాను ఎదుర్కొనే దమ్ము లేదు..

ప్రధాని మోడీ తన ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా  పెట్టకపోవడంపై స్పం దిస్తూ..‘‘కనీసం  కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టమని పీఎంకు మీరైనా చెప్పం డి. ఇదేం బాగాలేదు.అంతర్జాతీయ వేదికలపై ఆయన టెర్రిబుల్ గా కనిపిస్తారు. ఇండియాలో మీడియాను ఎదుర్కొనే దమ్ము లేదు” అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల విషయంలో ఎలక్షన్ కమిషన్ పూర్తి ఏకపక్షంగా ఉంటోందన్నారు.

ఆ పప్పులు ఉడకవు

‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు  హామీ ఇచ్చారు. కానీ ఇవాళ నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఎంప్లాయ్ మెంట్ గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే ఐదేళ్ల పాలనలో ఏమైనా చేసి ఉంటే కదా. ఓ రికార్డు , ఓ ప్లాన్ అంటూ ఉంటేగా”అని రాహుల్  విమర్శించారు. ‘‘మోడీ మొదట అవినీతి గురిం చి మాట్లాడారు. ఇప్పుడు చౌకీదార్ అంటున్నారు. ఆయన  చౌకీదార్ అనగానే… ‘చౌర్ హై’ అని ప్రజలు అంటున్నారు. దృష్టి మళ్లించడమే మోడీ సిస్టమ్. గతంలో గుజరాత్ లో కూడా ఇలానే చేశారు. ఏవేవో చెప్పి ప్రజలను డిస్ట్రాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం తథ్యం ” అన్నారు. ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరవుతారని ప్రశ్నించగా, ప్రజలు నిర్ణయిస్తారని బదులిచ్చారు.

మోడీని ఓడించడమే ఏకైక గోల్

ఇండియా టుడే ఇంటర్వ్యూలో రాహుల్

న్యూఢిల్లీ: ఎన్ని కల్లో మోడీ, బీజేపీలను ఓడిం చడమేతన గోల్ అని, భారతంలో అర్జునుడిలా.. చేప కన్నుమాత్రమే చూస్తున్నానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీ అన్నారు. ఎన్ని కల ప్రచారంలో భాగంగాఢిల్లీ నుం చి ఆగ్రాకు వెళ్తూ ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

2019 ఎన్ని కలు న్యాయ్, నేషనలిజం మధ్యేనా?

కాదు. నిరుద్యోగం.. వ్యవసాయం.. ఎకానమీ..అవినీతి.. సుప్రీంకోర్టు, ఈసీ వంటి ప్రభుత్వ సంస్థల-పై దాడి. వీటి ఆధారంగానే 2019 ఎన్ని కల యుద్ధం జరుగుతోంది.

జాతీయ భద్రత సమస్య గురించి బీజేపీ మాట్లాడుతోంది కదా?

దృష్టి మళ్లించేం దుకే నేషనల్ సెక్యూరిటీ గురిం చిమోడీ మాట్లా డుతున్నారు. నిరుద్యోగం, రైతులఆత్మహత్యలు ముఖ్యమైన సమస్యలు కాదా? వాటి గురించి మోడీ ఎందుకు మాట్లా డరు? పాకిస్థా న్ టెర్రరిజానికి సపోర్ట్ ఇస్తోంది. టెర్రర్‌ దాడులు చేయాలని చూస్తుంది. నిజమే. మరి ఇండియన్ సోల్జర్లను కాపాడటం ప్రధాని రెస్పాన్సిబులిటీ కాదా? ‘నేను సీఆర్పీఎఫ్ జవాన్లను కాపాడటంలో విఫలమయ్యాను’ అని ప్రజల ముందుకొచ్చి ఎందుకు చెప్పరు?

సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెబుతున్నారు కదా?

ఔను మన్మోహన్ సింగ్ హయాంలో మూడు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం . కానీ మేం ప్రపంచానికి చెప్పలేదు. ఎందుకంటే భద్రతా దళాలతో రాజకీయం చేయాలనుకోలేదు. మేం ఆర్మీని గౌరవిస్తాం . సెల్యూట్ చేస్తాం .

మూడు స్ర్టైక్స్ తో ఏం సాధించారు?

ఏం జరిగిందో బయటికి చెప్పలేను. కానీ మేం అనుకున్నది సాధించాం . లక్ష్యాన్ని ఛేదించాం.

మోడీ విదేశీ విధానం గురించి ..

మోడీకి విదేశీ విధానం అంటూ ఏదీ లేదు. ఆఫ్ఘనిస్థా న్ పోతాడు. అక్కడి నుంచి వస్తూ ఉన్నట్టుండి విమానాన్ని పాకిస్థాన్ కు మళ్లిస్తాడు. అలా వెళ్తే ఆఫ్ఘన్ ప్రజలకు నెగెటివ్ మెసేజ్ వెళ్తుందన్న కనీస జ్ఞానం కూడా లేదాయనకు. విదేశీ విధానం గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా మోడీకి లేదు. ఎంతమందిని వీలైతే అంతమంది విదేశీ నేతలను కౌగిలిం చుకోవడమే ఫారిన్ పాలసీ అని అనుకుంటు న్నారేమో?

మీరు కూడా మోడీని హగ్ చేసుకున్నారు కదా?

ఆయన విదేశీ నేత కాదు.

ఒకవేళ యూపీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెసేతర నేత పీఎం అయితే మీకు ఓకేనా ?

నాకున్నది ఒకే గోల్. ఈ ఎన్నికల్లో మోడీ, బీజేపీలను ఓడించాలి. సీబీఐ, ఈసీ వంటి ప్రభుత్వ సంస్థలను కాపాడాలి. నేను ఇంకేమీ చూడటం లేదు.భారతంలో అర్జునుడిలా.. చేప కన్ను మాత్రమే చూస్తున్నా. గురి తప్పను. బాణంతో కన్నును కొట్టేస్తా. ఎన్నికలను పూర్తయి రిజల్ట్స్ రానివ్వండి. తర్వాత చూద్దాం.