మోడీ సర్కార్ తప్పిపోయింది: రాహుల్ గాంధీ

మోడీ సర్కార్ తప్పిపోయింది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటడమే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. దీనిపై కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకొని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కామెంట్లు చేశారు. దేశంలో మోడీ సర్కార్ ఆచూకీ లేదన్నారు. ‘20 లక్షల మార్క్‌ను దాటేశాం. మోడీ గవర్నమెంట్ మిస్సయ్యింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై తన సలహాలను మరోమారు రాహుల్ షేర్ చేశారు.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తిస్తున్న స్పీడ్ అలాగే కొనసాగితే ఆగస్టు 10లోపు 20 లక్షలకు పైగా కేసులు నమోదవుతాయని తాను హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా కేసుల విషయంలో యూఎస్, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో ప్లేస్‌లో ఉంది. మన దేశంలో మహమ్మారి బారిన పడి 40 వేల మంది చనిపోయారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇండియాలో కరోనా రికవరీల సంఖ్య 13.70 లక్షలు అని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డేటాను బట్టి తెలుస్తోంది.