
ఢిల్లీ ఔరంగజేబ్ లేన్ లోని స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ ద్వేషంతో ప్రచారం చేస్తే… తాము ప్రేమతో ముందుకెళ్లామని, చివరకు ప్రేమే గెలుస్తుందన్నారు. ఆ తర్వాత తన నివాసం వరకూ నడుచుకుంటూ వెళ్లారు రాహుల్. ఉపాధి, ఉద్యోగాలు లేకపోవడం, నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కు జరిగిన నష్టం, రాఫెల్ డీల్ లో అవినీతి వ్యవహారాలు తదితర అంశాల అజెండాపై ఎన్నికల ప్రచారం జరిగిందన్నారు. ప్రజలే తమకు యజమానులని, ఎన్ని సీట్లు వస్తాయన్నది జనమే డిసైడ్ చేస్తారన్నారు రాహుల్ గాంధీ.
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని నిర్మాన్ భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రియాంక గాంధీ వాద్రా తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ టైం అయిపోయిందని.. కాంగ్రెస్ గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.