
మోడీ ప్రచారానికి తగ్గట్టుగా ఈసీ షెడ్యూల్
ఈసీ పక్షపాతంతో వ్యవహరించింది – రాహుల్
ప్రధాని మోడీ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పంచ్ డైలాగులు విసిరారు. మోడీ, షా ప్రెస్ మీట్ టైమ్ లోనే మీడియా ముందుకొచ్చిన రాహుల్… వరుస విమర్శలు చేశారు. పేదలకు మంచి చేస్తారని, ఉద్యోగాలు ఇప్పిస్తారని అధికారం ఇస్తే మోడీ … ఐదేళ్ల పాటు… పదే పదే ప్రసంగాలతో మాటలు చెప్పారనీ.. మనసులో ఏదనిపిస్తే అది చెప్పడానికి ప్రయత్నించారు గానీ.. ఏనాడు పేదల కోసం పనిచేయలేదని అన్నారు.
డోర్స్ బంద్ చేసి మోడీ జబర్దస్త్ ప్రెస్ మీట్
ప్రధానమంత్రి మోడీ తొలిసారి ప్రెస్ మీట్ కు రావడం గొప్ప విషయం అన్నారు రాహుల్. అమిత్ షాతో కలిసి ఆయన మీడియా ముందుకు రావడం గతంలో ఏనాడూ చూడలేదని అన్నారు. పక్కా ప్లాన్డ్ గా ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. డోర్స్ బంద్ చేసి.. కొంతమంది జర్నలిస్టులను బయటే ఆపేసి… జబర్దస్త్ గా ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు రాహుల్. మోడీని ఎవరూ ప్రశ్నించకూడదని కొందరిని బయటే ఆపేశారని ఆరోపించారు.
ఇవాళ ఢిల్లీలో వర్షం పడుతోంది. కానీ.. మోడీ మాత్రం హెలికాప్టర్ లో తిరుగుతున్నారు. ఏం.. రాడార్లకు మేఘాలు అడ్డురాలేదా.. అని వెటకారం చేశారు రాహుల్. ఎయిర్ ఫోర్స్ గురించి ఓ ప్రధానమంత్రి అలా మాట్లాడటం పెద్ద వింత అన్నారు.
ప్రధానమంత్రి తన కుటుంబంపై విమర్శలు చేశారని చెప్పిన రాహుల్ గాంధీ.. తాను మాత్రం మోడీ కుటుంబంపై విమర్శలు చేయదల్చుకోలేదని అన్నారు. గతానికి.. ఇప్పటికీ తాను చాలా ఇంప్రూవ్ అయ్యానని రాహుల్ గాంధీ చెప్పారు. పదే పదే విమర్శించడం వల్లే తాను ఇలా స్ట్రాంగ్ అయ్యానని అన్నారు.