రాజ్యాంగంపై మోదీ, అమిత్​ షా దాడి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్​

రాజ్యాంగంపై మోదీ, అమిత్​ షా దాడి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్​

న్యూఢిల్లీ: రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్​ అయ్యారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇకపై ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా ప్రధాని తప్పించుకోలేరని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి జూన్ 25 నాటికి 50 ఏండ్లు నిండుతాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.

ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజల తరఫున ఇండియా బ్లాక్ పోరాడుతుందని రాహుల్​ చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ఏ శక్తీ తాకకుండా కాపాడుతా మని వెల్లడించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. ప్రధాని తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. రైలు ప్రమాదాలు, ప్యాసింజర్ల అవస్థలు, కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీవ్రవాద దాడులు, నీట్ స్కామ్, నీట్ పీజీ రద్దు, యూజీసీ నెట్ పేపర్ లీక్, పెరుగుతున్న పాలు, పప్పులు, గ్యాస్, టోల్ ధరలు, నీటి ఇబ్బందులు, హీట్ వేవ్​ మరణాలను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.