కాంగ్రెస్ మేనిఫెస్టో భారతీయు ఆత్మఅన్నారు రాహుల్ గాంధీ. ప్రజలు ఏం కోరుకుంటున్నారో..మా మేనిఫెస్టో అదే పెట్టామన్నారు. మా మేనిఫెస్టోలో మహిళలకు సంక్షే మానికి పెద్దపీట వేశామన్నారు. మహిళలకు న్యాయం పేరుతో గ్యారంటీ ప్రకటించారు రాహుల్ గాంధీ. మహిళలు ఆర్థికంగా బలపడితే దేశ ముఖచిత్రమే మారు తుందన్నారు. ప్రతి ఫ్యామిలీ ఏటా ఆదాయం లక్ష కంటే తక్కువగా ఉండబోదన్నారు రాహుల్ గాంధీ.
మరోవైపు రైతులకు న్యాయం పేరుతో మూడో హామీ ప్రకటించామన్నారు రాహుల్ గాంధీ. దేశంలో ధనవంతులకు రూ. 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. కేంద్రంలో రాబోయే మా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి తీరుతుందన్నారు. పంట మద్దతు ధరను చట్టబద్దత కల్పిస్తామన్నారు రాహుల్ గాంధీ. ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారు.