నేను ముందే హెచ్చరించా.. ఆర్‌‌బీఐ రిపోర్ట్‌పై రాహుల్ కామెంట్

నేను ముందే హెచ్చరించా.. ఆర్‌‌బీఐ రిపోర్ట్‌పై రాహుల్ కామెంట్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంకోచ పరిస్థితిలో పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్‌‌బీఐ) హెచ్చరించింది. ఆర్‌‌బీఐ రిపోర్ట్‌ ఆధారంగా కాంగ్రెస్ మాజీ చీఫ్‌ రాహుల్ గాంధీ కేంద్రంపై మరోమారు విమర్శలకు దిగారు. మీడియా ద్వారా తప్పుదోవ పట్టిస్తూ పేదలకు సాయం చేయలేరని మండిపడ్డారు. లాక్‌డౌన్ సమయంలో దేశ ఎకానమీపై జాగ్రత్తగా ఉండాలని తాను పలుమార్లు హెచ్పరించానన్నారు. తాజాగా ఆర్‌‌బీఐ వార్నింగ్‌తో ఆ విషయం కన్ఫార్మ్‌ అయిందన్నారు.

‘గత కొన్ని నెలలుగా నేను చేస్తున్న హెచ్చరికలకు ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి, కానీ రుణాలు ఇవ్వకూడదు. ప్రజలకు డబ్బు ఇవ్వాలి, వ్యాపారవేత్తలకు పన్ను మినహాయింపులు ఇవ్వకూడదు. వినియోగం ద్వారా ఎకానమీని పున: ప్రారంభించాలి. మీడియా ద్వారా పక్క దారి మళ్లించాలని చూస్తే అది పేదలకు ఎంత మాత్రం ఉపయోగపడదు. అలాగే దీని వల్ల ఆర్థిక సంక్షోభమూ మాయమవ్వదు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కొన్నేళ్ల గ్రోత్ రేట్ తర్వాత కరోనా వల్ల ఎకానమీ వరుస కార్డర్స్‌లో స్లోడౌన్ అయిందని ఆర్‌‌బీఐ తెలిపింది.