బీహార్ యాత్రలో రాహుల్ కి వింత అనుభవం.. సడన్ గా వచ్చి హగ్, కిస్ ఇచ్చాడు.. !

బీహార్ యాత్రలో రాహుల్ కి వింత అనుభవం.. సడన్ గా వచ్చి హగ్, కిస్ ఇచ్చాడు.. !

బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. యాత్రలో జనం మధ్యలో నుంచి వచ్చిన ఓ వ్యక్తి సడన్ గా రాహుల్ గాంధీని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆదివారం ( ఆగస్టు 24 ) బీహార్ లోని పూర్నియా జిల్లాలో యాత్ర సాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో రాహుల్ గాంధీ సహా అంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది అతన్ని కొట్టి పక్కకు లాగారు. ఈ ఘటన జరిగిన సమయంలో షాక్ కి గురైన రాహుల్ గాంధీ.. వెంటనే తేరుకొని చిరునవ్వుతో యాత్ర కొనసాగిచారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా వందలాది మంది బైకర్లు పాల్గొన్న ఈ యాత్రలో మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి సడన్ గా వచ్చి కిస్ ఇచ్చాడు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నడుపుతున్న బైక్ ఒక్కసారిగా బ్యాలన్స్ తప్పింది. షాక్ నుంచి వెంటనే తేరుకున్న రాహుల్ గాంధీ చిరునవ్వుతో యాత్రను కొనసాగించారు. ఇదిలా ఉండగా.. ఇది భద్రతా వైఫల్యమంటూ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

ఈ ఘటనపై స్పందించిన పూర్నియా ఎస్పీ స్వీటీ సెహ్రావత్ రాహుల్ గాంధీని క్లోజ్ ప్రొటెక్షన్ టీం ఎస్కార్ట్ చేస్తోందని.. వారు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అన్నారు. క్లోజ్ ప్రొటెక్షన్ టీం ఇచ్చిన సమాచారంతో సదరు వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని అన్నారు.