ఆగస్టు రెండో వారానికి మరో 10 లక్షల కేసులు: రాహుల్ గాంధీ

ఆగస్టు రెండో వారానికి మరో 10 లక్షల కేసులు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. వచ్చే నెల రెండో వారానికి ఇండియాలో 2 మిలియన్‌ల వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతాయని రాహుల్ చెప్పారు. అమెరికా, బ్రెజిల్ తర్వాత 10 లక్షల కేసులు దాటిన దేశంగా ఇండియా ఉన్న నేపథ్యంలో పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటం భయాందోళనలు రేపుతోంది.

‘10 లక్షల కేసులు దాటాయి. ఒకవేళ కరోనా ఇదే రీతిలో వ్యాపిస్తే దేశంలో ఆగస్టు 10కల్లా 20 లక్షల పాజిటివ్‌లు నమోదవ్వొచ్చు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. మహమ్మారిని నిలువరించడానికి సర్కార్ పటిష్టమైన చర్యలు, ఆచరణాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. ఈ వారంలో 10 లక్షల కేసులు దాటొచ్చు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ‘సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మహమ్మారి మరింతగా విజృంభిచే ప్రమాదం ఉందని’ వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ ట్రెడోస్ అధనొమ్ చేసిన హెచ్చరికను రాహుల్ జత చేశారు.