ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పద్దతిలో ఎన్నికలు జరగడాన్ని టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. దీనిపై రాహుల్ గాంధీ తన అభ్రిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించకూడదని అక్కడి ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా కోరారు. అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) హ్యాకింగ్‌కు గురవ్వడంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించవచ్చని సూచించారు.
అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న వార్తలపై మస్క్ ఇలా అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఎక్స్ లో స్పందించారు. ఇండియాలో EVMలు ఒక బ్లాక్ బాక్స్ అని రాహుల్ ఎద్దేవా చేశారు. వాటిని క్రాస్ చెక్ చేయడానికి ఎవరికీ పర్మీషన్ ఉండదని విమర్శించారు. మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చాలా ఆంధోళనలు ఉన్నాయని, ప్రభుత్వ సంస్థలు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వాయం మోసపూరితంగా మారుతుందని రాహుల్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.