దేశ ఖజానా నుంచి డబ్బులు దొంగిలించారు

దేశ ఖజానా నుంచి డబ్బులు దొంగిలించారు

రాఫెల్ డీల్‌పై రాహుల్ కామెంట్స్

న్యూఢిల్లీ: రాఫెల్ జెట్స్ కొనుగోలు విషయంపై కేంద్ర సర్కార్‌‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలుమార్లు విమర్శించారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా రాఫెల్‌ వివాదంపైనే రాహుల్ ఫోకస్ చేశారు. ఇప్పుడు మరోమారు ఇదే విషయంపై బీజేపీ సర్కార్‌‌పై రాహుల్ కామెంట్స్ చేశారు. ఒక సోర్స్ బేస్డ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) డిఫెన్స్ ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్స్‌కు సంబంధించిన డేటాను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే వీటిలో రాఫెల్ ఎయిర్‌‌క్రాఫ్ట్‌ కొనుగోలుకు సంబంధించిన ఆఫ్​సెట్ డీల్స్‌ సమాచారం లేదని సమాచారం. ఇదే విషయంపై సర్కార్‌‌ను లక్ష్యంగా చేసుకొని రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు.

‘రాఫెల్ విషయంలో భారత ఖజానా నుంచి డబ్బులు దొంగిలించారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు . ఈ వ్యాఖ్యలకు జతగా ‘నిజం ఒక్కటే, మార్గాలెన్నో’ అని మహాత్మా గాంధీ కొటేషన్‌ను యాడ్ చేశారు. అలాగే కాగ్ ఆడిట్‌కు సంబంధించి టైమ్స్‌ ఆఫ్​ ఇండియాలో వచ్చిన ఆర్టికల్‌ను కూడా జత చేశారు.

రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్‌‌ ఇచ్చారు. ఎవరైనా తమను తాము నాశనం చేసుకోవాలని కోరుకుంటే ఫిర్యాదు చేయడానికి మేమెవరమని పీయూష్ గోయల్ అన్నారు. 2024 ఎన్నికల్లో రాఫెల్‌ విషయంలో తమతో తలపడాల్సిందిగా రాహుల్‌ను ఆహ్వానిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.