
న్యూఢిల్లీ : తమిళనాడులోని ఊటీలో ఫేమస్ అయిన మోడిస్ చాక్లెట్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సందర్శించారు. ఇటీవల ఆయన వయనాడ్కు వెళ్తూ.. మార్గమధ్యలో అక్కడ ఆగారు. ఈ సందర్భంగా చాక్లెట్లు తయారుచేసి సందడి చేశారు. ఆ వీడియోను రాహుల్ ఆదివారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘ఊటీలోని ప్రముఖ చాక్లెట్ బ్రాండ్ ‘మోడిస్’ ఫ్యాక్టరీని ఇటీవల సందర్శించాను.
ఈ చిన్న బిజినెస్ వెనుక మురళీధర్ రావు, స్వాతి దంపతులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ సిబ్బంది 70 మంది.. అందరూ మహిళలే. వాళ్లు ఎంతో రుచికరమైన చాక్లెట్లు తయారు చేస్తున్నారు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.