యూపీలో దళితుడి హత్య ఘటన.. వాళ్లు ఏ నేరం చేయలేదు..వారిని నేరస్థులుగా చూస్తున్నారు: రాహుల్ గాంధీ

యూపీలో దళితుడి హత్య ఘటన.. వాళ్లు ఏ నేరం చేయలేదు..వారిని నేరస్థులుగా చూస్తున్నారు: రాహుల్ గాంధీ

యూపీలో హత్యకు గురైన దళితుడు కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. ఆ కుటుంబం ఏ నేరం చేయకపోయినా.. బతికున్నోళ్లను బెదిరిస్తున్నారు.. నన్ను కలుద్దామని ప్రయత్నించిన బాధిత కుటుంబాన్ని యుపి ప్రభుత్వం బెదిరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇటీవల రాయ్‌బరేలిలో హత్యకు గురైన దళిత వ్యక్తి హరిఓం వాల్మీకి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం(అక్టోబర్​17) కలిశారు. ఆ కుటుంబం ఆ నేరం చేయలేదు.. వారిపై నేరం మోపారు. వారిని నేరస్థులుగా చూస్తున్నారు. నన్ను కలవవద్దని అధికారులు ఆదేశించారని ఆ కుటుంబం చెబుతోందన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దారుణాలు, హత్యలు ,అత్యాచారాలు జరుగుతున్నాయి.. వారికి న్యాయం జరగాలని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. వారిని గౌరవించాలి. నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు రాహుల్​ గాంధీ.

మరోవైపు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ వాద్రా దళితుడి హత్యను ఖండించారు.  దేశవ్యాప్తంగా న్యాయం కోసం జరిగే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు.

అంతకుముందు రోజు వాల్మీకి కుటుంబం రాహుల్​ గాంధీని కలవడానికి నిరాకరించిన వీడియో వైరల్​ అయింది. రాష్ట్ర ప్రభుత్వం బాదిత కుటుంబానికి సాయం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తీరు మాకు సంతృప్తినిచ్చిందిన వాల్మీకి సోదరుడు వీడియోలో మాట్లాడారు.. అయితే స్వయంగా ఇవాళ రాహుల్​ గాంధీ బాధిత కుటుంబాన్ని కలిశారు. ఆ సమయంలో ప్రభుత్వ అధికారులు  రాహుల్​ కలవొద్దని బెదిరించారని బాధిత కుటుంబం తెలిపింది. 

అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన హరిఓం వాల్మీకి అనే దళితుడిని రాయ్‌బరేలిలోని జమునాపూర్ సమీపంలో దొంగ అనుకొని కొట్టి చంపారు.