స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ సేవ

స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ సేవ

కాంగ్రెస్‌ నేత  రాహుల్ గాంధీ పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. తలకు బ్లూ స్కార్ఫ్‌ ధరించి..స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. ఇతర భక్తులతో  కలిసి స్వర్ణ దేవాయలం ప్రాంగణంలో పాత్రలు శుభ్రం చేశారు. అనంతరం భజన బృందం సభ్యులతోపాటు కూర్చొని గుర్బానీ కీర్తనలు విన్నారు. 

ప్రత్యేక విమానంలో అమృత్‌సర్‌ చేరుకున్న రాహుల్ గాంధీ.. తలకు నీలం రంగు వస్త్రం కట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల తర్వాత మందిరంలోని సిక్కుల అత్యున్నత స్థానం అకల్​ టక్త్​ను సందర్శించారు. ఆ తర్వాత భక్తులు ఉపయోగించిన గిన్నెలను కడిగే సేవా కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం జరిగే పల్కి సేవా కార్యక్రమంలోనూ రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.

 రాహుల్ గాంధీ పర్యటన వివరాలను పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజా వారింగ్‌ వెల్లడించారు.

ALSO READ : కరోనా వ్యాక్సిన్ సృష్టికర్తకు నోబెల్ బహుమతి

 రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్‌ సాహిబ్‌కు వస్తున్నారని... ఇది పూర్తిగా వ్యక్తిగత, ఆధ్యాత్మిక యాత్ర అని చెప్పారు.  కాబట్టి రాహుల్ గాంధీ  గోప్యతను మనం గౌరవించాలి. ఆయనను కలిసేందుకు పార్టీ కార్యకర్తలెవరూ వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.