దిగ్విజయ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు : రాహుల్ గాంధీ

దిగ్విజయ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు : రాహుల్ గాంధీ

సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. భారత సాయుధ బలగాల సామర్థ్యం తమకు తెలుసునన్న రాహుల్.. వాళ్లు ఎలాంటి రుజువులు చూపించాల్సిన అవసరం లేదన్నారు. సైనికుల విధులపై తమకు స్పష్టత ఉందని, రక్షణ దళాల పట్ల తమకు గౌరవం ఉందని రాహుల్ స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వివరణ ఇచ్చారు.

మరోవైపు తన ఇమేజ్‌ని వక్రీకరించేందుకు బీజేపీ కోట్లు ఖర్చు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అది ఎప్పుడో ఒకప్పుడు  బయటపడుతుందని అన్నారు. దేశంలో సత్యం పనిచేస్తుందే తప్ప డబ్బు, అధికారం, అహంకారం కాదని అన్నారు. ఈ కఠోర వాస్తవం బీజేపీ నాయకులకు నెమ్మదిగా అర్థమవుతుందని రాహుల్ తెలిపారు.