హిమాచల్ సర్కారును కూల్చేస్తమని మోదీ పబ్లిక్​గానే అంటున్నడు: రాహుల్‌‌‌‌ గాంధీ

హిమాచల్ సర్కారును కూల్చేస్తమని మోదీ పబ్లిక్​గానే అంటున్నడు: రాహుల్‌‌‌‌ గాంధీ

సిమ్లా: అవినీతి, డబ్బు ఉపయోగించి హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ప్రకటిస్తున్నారని కాంగ్రెస్‌‌‌‌ నేత రాహుల్‌‌‌‌ గాంధీ అన్నారు. ఆదివారం హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లోని ఉన్నావ్​, సిర్మౌర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని నహాన్‌‌‌‌ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌‌‌‌ పాల్గొని మాట్లాడారు. నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా అదానీ వంటి వారికి సాయం చేయడం కోసం.. చిన్న మధ్యతరహా వ్యాపారాలను నాశనం చేశారని మండిపడ్డారు.

తద్వారా నిరుద్యోగాన్ని మోదీ పెంచుతున్నారని ఆరోపించారు. ఆర్మీ జవాన్లకు గుండెకాయలాంటి ఉనాలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ హమీర్‌‌‌‌‌‌‌‌పూర్ లోక్‌‌‌‌సభ అభ్యర్థి సత్పాల్‌‌‌‌ రైజాదాను గెలిపించాలని రాహుల్‌‌‌‌ కోరారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నివీర్​ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, మోదీ ప్రభుత్వం గత పదేండ్లలో 22 మందికి రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, అయితే, గతేడాది భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.9 వేల కోట్లు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రానికి సహయం చేయడానికి బదులు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మోదీ ప్రయత్నించారని ఆరోపించారు.

ఆపిల్‌‌‌‌ ధరలను నియంత్రించడానికి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే స్టోరేజ్‌‌‌‌ ఫెసిలిటీస్‌‌‌‌ను అప్పగించారన్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఏటా రూ.లక్ష అందజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. గ్రాడ్యుయేషన్‌‌‌‌ పూర్తి చేసిన యువతకు ‘పెహ్లీ నౌక్రీ పక్కి అధికార్‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమం కింద ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్‌‌‌‌ పేర్కొన్నారు.